కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కెరీర్ స్టార్టింగ్ లో పండు లాంటి మంచి హాట్ ఫిగర్ తో అందాల ప్రదర్శనతో ఓ ఊపు ఊపేసిన నయనతార స్టార్డమ్ దక్కిన తర్వాత మాత్రం గ్లామర్ షోకు దూరమైంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది.అయితే ఇప్పుడు సామ్ కూడా నయన్ ని కాపీ కొట్టబోతుంది.నయన్ బాటలోనే అందాల ఆరబోతకు దూరంగా ఉండాలని భావిస్తుందట. గ్లామర్ క్యారెక్టర్స్ ను ఇకపై అస్సలు ఒప్పుకోకూడదని.. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణించాలని నిర్ణయించుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మరి సామ్ నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే.. అది ఖచ్చితంగా ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇకపోతే సమంత కొద్ది నెలల క్రితం భర్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు బాగా ఎంజాయ్ చేసి విడాకులు తీసుకున్నారు.


విడిపోడానికి కారణం ఏదైనా కాని విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.ఇక చైతుతో సపరేట్ అయిన దగ్గర నుంచీ సమంత కెరీర్ పరంగా మరింత స్పైసీగా తయారు చేసుకుంది.వరుసగా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `యశోద` `శాకుంతలం` `ఖుషి` చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఇంకా అలాగే హిందీలో పలు ప్రాజెక్ట్స్ ను టేకప్ చేసిన సమంత.. `అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్` అనే సినిమాతో త్వరలోనే హాలీవుడ్ లోకి సైతం అడుగు పెట్టబోతోంది. ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.అయితే సామ్ కే అర్ధం కానీ ఇంకో విషయం ఏమిటంటే గ్లామర్ కి దూరంగా ఉండే ఇలాంటి నిర్ణయాన్ని భర్త చైతు ఇదివరకే చెప్పాడు. కానీ ఈ అమ్మడు సరిగ్గా అర్ధం చేసుకోలేక పెటాకులు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: