తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రామిసింగ్ నటుడుగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సత్య దేవ్ ,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే సత్య దేవ్ తాజాగా గుర్తుందా సీతాకాలం అనే మూవీ లో కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ,  సత్య దేవ్ సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. అలాగే ప్రస్తుతం సత్య దేవ్ 'కృష్ణమ్మ' అనే మరో మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇలా వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ని ముందుకు సాగిస్తున్న సత్యసిదేవ్ తాజాగా మరో కొత్త మూవీ ని ప్రారంభించాడు. తాజాగా ప్రారంభించబడిన సత్య దేవ్ సినిమా ఈ నటుడి కెరియర్ లో 26 వ మూవీ గా తెరకెక్కబోతుంది. నిన్న సత్య దేవ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా నిన్న అనగా సెప్టెంబర్ 30 వ తేదీ నుండి ప్రారంభం అయింది. ఓల్డ్ టౌన్ పిక్చర్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ కు చరణ్ రాజ్ సంగీతం అందించనున్నాడు. అలాగే ఈ మూవీ లో కన్నడ నటుడు డాలి ధనుంజయ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: