ఇక ప్రభాస్ బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండనున్నారన్న వార్త ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయితే ఫ్యాన్స్ తమ వేడుకలు జరుపుకోవచ్చు. దానికి ఎలాంటి అడ్డంకి ఆయన చెప్పలేదు. తమ తమ ఊళ్లలో ప్రభాస్ బర్త్ డే వేడుకలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తపరచలేదు. ఇక బిల్లా, రెబల్ చిత్రాల స్పెషల్ షోస్ వరల్డ్ వైడ్ ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు థియేటర్స్ లో బిల్లా విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం 4కే వర్షన్ అందుబాటులోకి తెచ్చారు.
అలాగే ప్రభాస్ నటిస్తున్న చిత్రాల నుండి ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయని సమాచారం. ప్రాజెక్ట్ కే, సలార్ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మరి ఈ రెండు చిత్రాల నుండి బర్త్ డే పోస్టర్స్ ఉండవచ్చు. సంక్రాంతి కి విడుదల కానున్న ఆదిపురుష్ నుండి మరో టీజర్ విడుదల చేసే ఆస్కారం కలదు. కాగా ఆదిపురుష్ విడుదల వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది అంటున్నారు. అదే నిజమైతే ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి