బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు అయినటు వంటి వరుణ్ ధావన్ తాజాగా బేడియా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని తోడేలు అనే పేరుతో విడుదల చేయనున్నారు. నవంబర్ 25 వ తేదీన ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు , తమిళ భాష లలో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ తెలుగు లో కూడా ప్రమోషన్ లను నిర్వహించింది.

అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ కూడా అత్యద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా తెలుగు సినీ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న నేపథ్యం లో ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మరి తోడేలు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం. తోడేలు సినిమా నైజాం ఏరియా లో 100 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.

అలాగే ఈ సినిమా సీడెడ్ ఏరియా లో 40 థియేటర్ లలో విడుదల కానుండగా , ఆంధ్ర ఏరియా లో 120 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తోడేలు సినిమా 260 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. మరి ఈ సినిమా కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి అదిరిపోయి రేంజ్ కలెక్షన్ లు లభించే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: