‘వాల్టేర్ వీరయ్య’ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు వచ్చిన స్పందన తరువాత బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతూ ఉండటంతో ఆ పాట ఎలా ఉంటుంది అన్న భయాలు బాలయ్య అభిమానులలో చాల ఎక్కువగా కనిపించాయి. చిరంజీవి సినిమాలోని ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ పాట స్థాయి కంటే ఎక్కువగా కనిపించకపోతే సంగీత దర్శకుడు తమన్ మీద బాలయ్య అభిమానులు విరుచుకు పడిపోతారు.


దీనితో సంగీత దర్శకుడు తమన్ పై కూడ విపరీతమైన ఒత్తిడి ఏర్పడింది. అయితే తమన్ తన మొదటి పరీక్షలో నెగ్గాడు అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ‘జై బాలయ్య’ బాలకృష్ణ అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేమికులకు కూడ నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘అఖండ’ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆల్బమ్ కావడంతో అభిమానుల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.


దీనికి తగ్గట్టుగానే తమన్ ఈ పాటను బాగానే కంపోజ్ చేసాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాటను పాడిన కరీముల్లా గాత్రం మంచి డెప్త్ ని తీసుకొచ్చింది అని అంటున్నారు. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు అంటూ రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన పాటకు తమన్ మంచి ట్యూన్ ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం ఈ పాటను విన్న వారికి దాసరి విజయ్ శాంతిల  కాంబినేషన్ లో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ పాట ట్యూన్ ‘జై బాలయ్య’ ట్యూన్ లో కనిపిస్తోంది అంటు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


 సంక్రాంతికి జరగబోతున్న చిరంజీవి బాలకృష్ణ ల సినిమాల వార్ దాదాపు ఈ హడావిడి రెండు నెలల ముందే ప్రారంభం అయినట్లు అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటల వార్ పూర్తి కాగానే ఈ రెండు సినిమాల విడుదల తరువాత ఈ రెండు సినిమాల కలక్షన్స్ వార్ కొనసాగుతుంది అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: