ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ‘అవతార్ 2’ మ్యానియాలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించి విడుదలైన అన్ని టీజర్లకు విపరీతమైన స్పందన తెలుగు ప్రజల నుండి రావడంతో ఈ మూవీ డిసెంబర్ 16 నుండి తెలుగు రాష్ట్రాలలో కలక్షన్స్ సునామి సృష్టించడం ఖాయం అని అంటున్నారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు 85 కోట్లకు కొన్నట్లుగా వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో పెట్టుబడి పెట్టడం చాల సాహసం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ సాహసానికి అనుగుణంగా డిసెంబర్ 16 నుండి 25వ తారీఖు వరకు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ ధియేటర్లు ‘అవతార్ 2’ తోనే నుండిపోతాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో క్రిస్మస్ రేస్ ను నమ్ముకుని విడుదల అవుతున్న రవితేజా ‘ధమాక’ మూవీకి ధియేటర్ల సమస్య ఏర్పడ వచ్చని అంటున్నారు.


ఇప్పటికే రవితేజా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతూ అతడి సినిమాలకు సరైన ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రావడం లేదు. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని పొందిన మాస్ మహారాజా కు ఇప్పుడు గడ్డుకాలం కొనసాగుతోంది. దీనితో ఎట్టి పరిస్థితులలోను ‘ధమాక’ సూపర్ హిట్ అయి తీరాలి.


అయితే తెలుగు ప్రేక్షకులు అంతా ‘అవతార్ 2’ మ్యానియాతో ఉండే పరిస్థితులలో రవితేజా ను ఎంతవరకు పట్టించుకుంటారు అన్న సందేహాలు వస్తున్నాయి. దీనికితోడు ఇదే క్రిస్మస్ రేస్ ను నమ్ముకుని ‘కార్తికేయ 2’ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన నిఖిల్ ’18 పేజస్’ నందిని రెడ్డి ‘అన్ని మంచి శకునములే’ మూవీలు కూడ క్రిస్మస్ కు విడుదల అవుతున్న పరిస్థితులలో ‘అవతార్ 2’ సునామి ముందు ఈ సినిమాలు తట్టుకోగలవా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: