టాలీవుడ్ స్టార్ హీరో మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన  నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్ అయ్యింది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక  ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్లో చరణ్ తన 16 మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చరణ్..ప్రస్తుతం సంచలన డైరెక్టర్ శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే  దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న 

మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇక  ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే తన నెక్స్ట్ మూవీ ని ప్రకటించేశాడు.అయితే ఉప్పెన తో డైరెక్టర్ గా పరిచమైన బుచ్చిబాబు... మొదటి మూవీ తోనే యూత్ తో పాటు స్టార్ హీరోస్ ను ఆకట్టుకున్నాడు.ఇక  ఉప్పెన హిట్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఎన్టీఆర్ కోసం దాదాపు రెండేళ్లు గా ఎదురుచూస్తూ వచ్చాడు. కానీ  ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే దీంతో ఎన్టీఆర్ తో చేయాలనుకున్న కథనే చరణ్ కు చెప్పి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.

అంతే కాదు  ఇక చరణ్ తో ఈ సినిమా చెయ్యి అని ఎన్టీఅరే చెప్పాడని అంటున్నారు. ఇక ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ బుచ్చిబాబు తో చరణ్ సినిమా అని ప్రకటన వచ్చిన దగ్గరి నుండి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అయితే  ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ వ్రైటింగ్స్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు.ఇకపోతే  పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: