తమిళ స్టార్  హీరో తెలుగు వారికి కూడా ఇష్టమైన హీరో కార్తి హీరోగా 'అభిమన్యుడు' ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సర్దార్'.ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన 'అన్నపూర్ణ స్టూడియోస్' ద్వారా విడుదల చేశారు.మొదటి రోజు ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.దీంతో తెలుగులో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలవడంతో పాటు బయ్యర్స్ కు కూడా లాభాలను  అందించింది.


ఒకసారి 'సర్దార్' క్లోజింగ్ వసూళ్లని గమనిస్తే..'సర్దార్' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల దాకా షేర్ ను రాబట్టాలి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇక ఫుల్ రన్ ముగిసేసరికి మొత్తం రూ.7.77 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్స్ కు రూ.2.87 కోట్ల లాభాలను అందించింది.'కాంతార' సినిమా లేకపోతే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసుండేది అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ పోటీలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా తరువాత కార్తీ జపాన్  అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా తమిళనాడులోని తూటికోరైన్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: