వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ , బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి తో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ నిర్వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ ఇంటర్వ్యూ ను రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూ కు యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ కూడా లభించాయి.

ఇది వరకే రామ్ గోపాల్ వర్మ , ఆశు రెడ్డి తో ఒక ఇంటర్వ్యూ ను నిర్వహించాడు. ఆ ఇంటర్వ్యూ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో వీరిద్దరూ కలిసి రెండవ సారి మరో ఇంటర్వ్యూ ను నిర్వహించారు. ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ తాజాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అవతార్ దీ వే ఆఫ్ వాటర్ మూవీ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ ... ఇప్పుడే అవతార్ 2 మూవీ లో స్నానం చేశాను. దీన్ని ఒక మూవీ అనడం నేరం. ఎందుకంటే ఇది అంతకు మించి ఎక్కువ. ఇదొక జీవిత కాలపు అనుభూతి. కళ్ళు చెదిరే దృశ్యాలు. మతులు పోయే యాక్షన్స్ సన్నివేశాలు చూస్తూ ఉంటే చాలా సార్లు ఒక దిమ్ పార్కులో ఉన్నామా అనేంతగా సమ్మోహనంలో ముంచెత్తింది అని రామ్ గోపాల్ వర్మ వివరించాడు. ఇది ఇలా ఉంటే జామ్స్ కెమరన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబర్ 16 వ తేదీన విడుదల అయింది.  ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: