తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త తరాన్ని ఎక్కువ సంఖ్యలో పరిచయం చేసిన దర్శకుడు తేజ..
చిత్రం సినిమా తో దర్శకుడు గా పరిచయం అయిన తేజ మొదటి సినిమాతోనే చక్కని విజయం అందుకున్నాడు.ఈ సినిమా తో తను దర్శకుడి గా నే కాకుండా హీరో, హీరోయిన్ మరియు కామెడీయన్స్ తోపాటు ఇంకా ఎంతో మంది టెక్నిషియన్స్ ని కూడా కొత్త వారిని తీసుకువచ్చాడు ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హీరో గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.అలాగే ఈ సినిమా తరువాత చేసిన జయం మూవీ తో నితిన్ సదా లాంటి కొత్త వాళ్లని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.

సినిమా కూడా మంచి విజయం అందుకోవడంతో తేజ రేంజ్ మారిపోయింది.అలా తేజ ఆ తర్వాత మహేష్ బాబు తో నిజం అనే సినిమాను కూడా చేసాడు. అయితే తేజ నితిన్ తో రెండోసారి వీళ్లిద్దరు కలిసి ధైర్యం అనే సినిమాను కూడా చేసారు అయితే ఈ సినిమా షూట్ చేసాక తేజ కొన్ని సీన్ లు అంత బాగా అయితే రాలేదు మనం అనుకున్న కధ సరిగ్గా రాలేదు మళ్ళి షూట్ చేద్దాం అంటే దానికి నిర్మాత అయిన నితిన్ వాళ్ళ నాన్న ఇప్పటికే ఈ సినిమా మీద చాలా డబ్బులు పెట్టాం.ఇక  మా వల్ల కాదు సినిమా ఎలా ఉన్న  కానీ పర్లేదు విడుదల చేసేద్దాం అదే ఆడుతుంది  అని చెప్పాడట.

దాంతో తేజ కి బాగా కోపం వచ్చి ఆ సినిమా ప్రివ్యూ చూడడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా బాగా రాలేదు ప్లాప్ అవుతుంది అని ఆయన చెప్పాడంట దాంతో సినిమా డైరెక్టరే ఇలా చెప్తున్నాడు అంటే ఇక సినిమా కొనుక్కొనడం వేస్ట్ అని వాళ్లలో కొందరు వెనక్కి కూడా వెళ్లిపోయారట దింతో అలా ఎందుకు చెప్తున్నారు అని నితిన్ తేజ ని అడగడం తో ఇద్దరి మధ్య గొడవ కూడా అయిందని సమాచారం....ఇప్పటికి కూడా వీళ్లిద్దరి మధ్య మాటలు లేవట... ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ ఓ ఒక సినిమా ను చేస్తున్నాడు.అలాగే తేజ కుడా దగ్గుబాటి అభిరామ్ తో అహింస అనే సినిమాను చేస్తున్నాడు.తేజ చాలా సంవత్సరాల తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టినప్పటికీ కూడా ఆ తర్వాత తీసిన సీత సినిమా మాత్రం ప్లాప్ అయింది దాంతో ఇప్పుడు అహింస సినిమా తో రాబోతున్న తేజకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: