ఈ ఏడాది ఆస్కార్స్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి  దర్శకత్వం వహించిన 'ఆర్.ఆర్.ఆర్'  సినిమాలోని తెలుగు పాట 'నాటు నాటు' పాట నామినేషన్ లో నిలిచింది.ఇక ఈ పాటకి ఎం.ఎం. కీరవాణి  సంగీత దర్శకుడుగా వ్యవహరించగా,చంద్రబోస్ ఈ పాటను రాయటం జరిగింది. అయితే ఈ పాట ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ నామినేషన్ లో ఉండటం అనేది కూడా చాలా గొప్ప ఘనతని సాధించినట్టే, ఎందుకంటే ఇంతవరకు కూడా ఆ నామినేషన్ దాకా వెళ్లిన భారత దేశ సినిమాలని మనం వేళ్ళమీద లెక్కించవచ్చు. ఇక తెలుగు సినిమా అయితే మొదటిసారి ఈ గొప్ప ఘనత సాధించింది. మరి తెలుగు పాట  ఈసారి ఆస్కార్ అవార్డు కనుక గెలిస్తే ఖచ్చితంగా అది కనీ వినీ ఎరుగని చరిత్ర సృష్టించినట్టే. ఇప్పుడు భారత దేశంలోని ప్రజలు అంతా కూడా ఎక్కువగా ఈ ఆస్కార్ అవార్డులు జరిగే మార్చి 12 వ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా వుంది. అదేంటంటే సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ  వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే తెలుగు పాటకి ఖచ్చితంగా ఆస్కార్ వచ్చినట్లే అని పరిశ్రమలో అంటున్నారు. ఎందుకంటే ఎవరికీ అయితే ఆస్కార్ అవార్డు వస్తుందో వాళ్ళని మాత్రమే ఇలా పిలిచి అక్కడ లైవ్ లో ప్రదర్శన ఇమ్మంటారు. గతంలో ఏ.ఆర్. రహమాన్ ని కూడా ఇలాగే ఆహ్వానించి లైవ్ ప్రదర్శన ఇప్పించారని, ఆ వేడుకలో అదే సంవత్సరం అతనికే అవార్డు రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు కీరవాణికి కూడా ఆహ్వానం రావటం ఖాయం అని అనుకుంటే 'నాటు నాటు' పాటకి అవార్డు రావడం  ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: