కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ పాత్రలలో నటించిన వేణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో కామెడీ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన వేణు ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో కూడా పాటిస్పేట్ చేసి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించాడు. ఇలా సినిమాలతో ... బుల్లి తెర షో లతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన వేణు తాజాగా బలగం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలెంటెడ్ నటుడు అయినటు వంటి ప్రియదర్శి హీరో గా నటించగా కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల్లో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా దక్కాయి. 15 రోజుల్లో బలగం మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

15 రోజుల్లో నైజాం ఏరియాలో బలగం మూవీ కి 9.75 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర మరియు సీడెడ్ లో కలుపుకొని ఈ మూవీ కి 5.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 15 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల షేర్ ... 15.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ కి కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 35 కలెక్షన్ లు లభించాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లో 7.16 కోట్ల షేర్ ... 15.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: