ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటు వంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు హిందీ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉండడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు హిందీ సినిమాల్లోనే నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ లపై పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

ఈ క్రేజీ ప్రాజక్ట్ ని మార్చి 2 3న గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తన అభిమాన నటుడు అయినటువంటి ఎన్టీఆర్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కారణంగా ఈ ముద్దుగుమ్మ చాలా ఎక్సైట్ అవుతుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 మూవీ గురించి మాట్లాడుతూ ... ఇప్పటికే దర్శకడు కొరటాల శివ కి చాలా సార్లు మెసేజ్ చేసానని, రెఫరెన్స్ లు ప్రిపరేటరీ షూట్స్ కోసం ఆయనని అడుగుతున్నానని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆ విధంగా మూవీ షూట్ కోసం తాను రోజులు లెక్కిస్తున్నానని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: