
అయితే ఈ రీ రిలీజ్ లో భాగంగా ఎన్నో సినిమాలు కలెక్షన్స్ బాగా వసూలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే హైయెస్ట్ రికార్డు సృష్టించింది. అంతే కాదు రీ రిలీజ్ లో కూడా మనదే హవా అన్నట్లుగా నిరూపించింది.. రీ రిలీజ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా రూ.1.65 కోట్ల తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా రూ.1.26 కోట్లతో రికార్డు సృష్టించింది. ఇక మూడవ స్థానంలో మహేష్ బాబు ఒక్కడు సినిమా రూ.90 లక్షలు రాబట్టి రికార్డు సృష్టించగా .. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా గతంలో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు రూ.75 లక్షలు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది.
ఇక చివరి స్థానంలో పోకిరి రూ.69 లక్షల కలెక్షన్ సాధించింది. అయితే ఈ లెక్కలన్నీ ఒక నైజాం ఏరియా కి పరిమితం అని చెప్పాలి. మొత్తానికైతే రీ రిలీజ్ లో కూడా తన హవా తగ్గించకుండా మళ్ళీ తన పేరు నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.