
దీంతో మెగా, అల్లు ఫ్యామిలీ ల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఏ చిన్న విషయం జరిగిన కూడా నిజంగానే విభేదాలు ఉన్నాయంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కాగా ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో అటు అల్లు అర్జున్ హాజరు కాకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ బృందం ఇక ఇలా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించింది. అల్లు బర్త్ డే పార్టీ కి రాకపోవడమే కాదు సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. ప్రతి ఏడాది చరణ్ పుట్టినరోజుకి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే బన్నీ ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అనే సందేహాలు తెర మీదకి రాగా బన్నీ బృందం క్లారిటీ ఇచ్చింది.
రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ ఇక వియత్నాంకు వెళ్లాడట. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడే ఉండి పోవాల్సి వచ్చిందట. దీంతో పార్టీకి హాజరు కాలేను అని బన్నీ ముందుగానే చరణ్ కు క్లారిటీ ఇచ్చాడట. అలాగే రామ్ చరణ్ సోదరి కూడా ఇక విదేశాలకు వెళ్లడం కారణంగానే చరణ్ పుట్టినరోజుకు హాజరు కాలేదు అన్నది తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ రామ్ చరణ్ వీడియో కాల్ లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్లు అల్లు టీం వివరణ ఇచ్చింది అని చెప్పాలి. చరణ్ కు ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి అల్లు అర్జున్ చాలాసేపు మాట్లాడి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడట. అయితే ఈ విషయం తెలియక అటు ఫాన్స్ మాత్రం ఏదేదో ఊహించుకొని విమర్శలు చేసుకుంటున్నారు అన్నది తెలుస్తుంది.