సైంధవ్ : విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ మూ వీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాకినాడలో జరుగుతుంది. కాకినాడలో ఈ చిత్ర బృందం ప్రస్తుతం వెంకటేష్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
ఓ జి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. ముంబై లో ఈ మూవీ యూనిట్ పవన్ మరియు ప్రియాంక పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
ఎన్టీఆర్ 30 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
ఎన్ బి కె 108 : బాలకృష్ణ హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ ... శ్రీ లీల పై ఈ చిత్ర బృందం సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.