తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సూర్య ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సూర్య సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి దిశా పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం ప్రారంభంలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దాదాపు 250 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్ర బృందం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే  ఈ మూవీ బృందం ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా యొక్క మొదటి పాట ను మే మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ మూవీ బృందం త్వరలోనే విడుదల చేయనునట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ భారీ బడ్జెట్ మూవీ ని స్టూడియో గ్రీన్ , యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: