రాంగోపాల్ వర్మ ఇప్పుడైతే అడల్ట్ సినిమాలు తీస్తూ అందరి చేత కాంట్రవర్సీలకు గురి అవుతున్నాడు. కానీ ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు ఎంతోమందికి ఆదర్శం.. అంతేకాదు ఈయన దగ్గర పనిచేసిన చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నవారు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అంతేకాదు ఈ డైరెక్టర్లకు ఒక సపరేటు ఇమేజ్ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే రాంగోపాల్ వర్మ ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయన మనసుపెట్టి ఒక సినిమా తీశాడు అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏ కాదు యాక్షన్ సన్నివేశాలు ఇలా ఒక్కటేమిటి డైరెక్షన్ విభాగానికే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వర్మ అని చెప్పడంలో సందేహం లేదు.
ఆయన తీసిన సినిమాలలో శివ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే . కాలేజీ కుర్రాల్లో కూడా ఈ సినిమా ట్రెండీగా మారిపోయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఆయన మాట్లాడుతూ నేను ముంబైలోని అంతేరీలో ఉన్న బారీజాన్ యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నప్పుడు అక్కడ వారు నాగార్జున సార్ నటించిన శివ సినిమాను మాకు రిఫరెన్స్ గా చూపించారు. ఇక వర్మ గారి డైరెక్షన్ నాగార్జున గారి నటన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి