స్టార్ మహేష్ బాబు మొదటిసారి తన భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి నిన్న రాత్రి ఒక ఈవెంట్ కు హాజరవ్వగా.. ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ లుక్ లో మ్యాన్లీ గా యువతను ఆకట్టుకుంటున్నారు. ఈయన ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు అన్నా.. అన్నం తింటున్నావా? లేక అందం తింటున్నావా? అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక యంగ్ హీరో రేంజ్ లో ఆయన గ్లామరస్ లుక్ మరింతగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ఫోటోలను నమ్రత కూడా షేర్ చేస్తూ మొదటిసారి మహేష్ బాబు , సితారతో కలిసి హాజరైన మొదటి ఈవెంట్ అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.
ఇకపోతే ఈవెంట్ ఎవరిది అన్న విషయాన్ని వస్తే..  అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకొని వివాహం రద్దు చేసుకున్న ప్రముఖ మోడల్ శ్రియ భూపాల్ శ్రీమంతం వేడుకలు.. అఖిల్ అక్కినేనితో నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత వివాహానికి రద్దు చెప్పుకున్న వీరు.. 2018 జూలై ఆరవ తేదీన ఆనందిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తనుఆమె వివాహం చేసుకుంది. అయితే తాజాగా ఆమె గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై పార్టీలో సందడి చేశారు.  ఇకపోతే శ్రీయ భూపాల్ పెళ్లికి ఉపాసన , రాంచరణ్ దంపతులు కూడా హాజరైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా గతంలో అఖిల్ అక్కినేని శ్రియ భూపాల్ నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అఖిల్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపైనే ఉంచారు . ఇక ఆయన మళ్లీ పెళ్లి అనే ఊసే ఎత్తలేదు.  కానీ శ్రీయ భూపాల్ మాత్రం ఇప్పుడు వివాహం చేసుకొని తల్లి కాబోతోంది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: