సినిమాల కంటే వివాదాల ద్వారానే కొంతమంది సెలబ్రిటీలు ఊహించని స్థాయిలో పాపులర్ అవుతుంటారు. అలా ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా పాపులర్ అవుతున్నారు.తాజాగా కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు కరాటే కళ్యాణి ఆటంకాలు క్రియేట్ చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా గత నెల 28వ తేదీన ఆవిష్కరించాల్సి ఉండ గా కరాటే కళ్యాణి క్రియేట్ చేసిన ఇబ్బందుల వల్ల ఆ పనులు అనుకున్న విధం గా జరగలేదు. అయితే తనకు ప్రాణాహాని ఉందంటూ తాజాగా కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆమె వెల్లడించడం గమనార్హం. నా కారు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక కారు టైర్ పేలిందని ఆమె చెప్పుకొచ్చారు. నా మీద ఉండే కోపం వల్లే కారు టైర్లను ఎవరో కోసేశారని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. ఖమ్మం లో రాజకీయం జరుగు తోందని ఈ గొడవకు టీడీపీ కి ఎలాంటి సంబంధం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ కు దైవత్వాన్ని ఆపాదించాలనే ఆలోచనతో కొంత మంది కృష్ణుని రూపంలో విగ్రహాలను పెట్టాలని ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. కృష్ణుని రూపం లో మనుషుల విగ్రహాలు పెట్టడం సరికాదని కృష్ణునికి ఒక రూపం ఉందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. అయితే కరాటే కళ్యాణిపై సోషల్ మీడియా లో నెగిటివిటీ మాత్రం పెరుగుతోంది. అనవసర వివాదా ల్లో జోక్యం చేసుకోవడం ఆమె కు అతిపెద్ద మైనస్ అవుతోంది. కరాటే కళ్యాణి ఇకనైనా వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: