టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా వినిపించేది దర్శకుడు శంకర్ పేరే. ఇక ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన మొదటి సినిమా నుండి ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ బ్రేక్ చేసిన డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం ఆయన పాస్టర్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకొని చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో పాటు ఆయన కమలహాసన్ ఇండియన్ టు సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ రెండు సినిమాలను కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారట శంకర్. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాని ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారట శంకర్.కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ చేస్తేనే బాగా సెట్ అవుతుందని చెప్పడంతో ఈ సినిమాని రాంచరణ్ తో తీస్తున్నాడట శంకర్.

 అయితే తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట శంకర్. ఆయనతో సినిమా చేయడానికి స్టోరీని సైతం సిద్ధం చేశారట. వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్ పై కి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు ,ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాలతో  బిజీగా ఉన్నాడు .ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తాడట పవన్ కళ్యాణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: