గతంలో ‘మిస్టర్’ ‘నోకియా’ ‘రన్’ లాంటి సినిమాలు తీసిన అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో ఈ మూవీని తీశారు. ఈమధ్యనే విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు స్పందన బాగా రావడంతో ఈమూవీని ఈవారం విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ ఫలితం తెలిపోవడంతో ఇక ఆసినిమా మ్యానియా ఉండదన్న ధైర్యంతో కొన్ని చిన్న సినిమాలు ఈవారం విడుదల కాబోతున్నాయి ఆ లిస్టులో ‘హిడింబ’ ఉంది. ’
అయితే ఈసినిమాకు సెన్సారు విషయంలో సమస్యలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సెన్సార్ సమస్యలు వచ్చాయని అంటున్నారు. ఈసినిమాను రీ సెన్సార్ చేయమని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో మితిమీరిన హింస సెక్స్ ఉండటంతో ఈమూవీని చూసిన సెన్సార్ సభ్యులు కూడ ఆధీరిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమా కథలో ప్రత్యేకమైన తెగ గురించి కొన్ని డైలాగ్స్ ఉండటంతో ఈమూవీలోని చాల సన్నివేశాల పట్ల సెన్సార్ అభ్యంతరాలు ఉన్నాయి అంటున్నారు.
దీనితో ఈసినిమా విడుదల ఈవారం ఉండకపోవచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ పై అశ్విన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈమధ్య కాలంలో కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో విజయం సాధిస్తున్న పరిస్థితులలో తన మూవీ కూడ హిట్ అవుతుందని అశ్విన్ ఆశపడ్డాడు. అయితే ఇప్పుడు ఈసినిమా విడుదల ఆగిపోవడంతో మరో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంచుకోవలసి వస్తుంది అయితే సెన్సార్ ను భయపెట్టిన ఆసన్నివేశాలు ఎలాంటివి అన్నది స్పష్టమైన క్లారిటీ లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి