టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ నటి మానులలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి సుశాంత్ హీరోగా రూపొందినటువంటి ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అందచందాలతో నటనతో ప్రేక్షకులను భాగానే అలరించింది. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ఖిలాడి సినిమాలో ఈ నటి హీరోయిన్ గ నటించింది.

రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను అందుకుంది. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం మీనాక్షి తన అందాల ప్రదర్శనతో తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

ఇది ఇలా ఉంటే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నుండి పూజ హెగ్డే ను తీసివేసి మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అని ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మీనాక్షి ఆ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఇప్పటికే గుంటూరు కారం మూవీ లోని ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: