ఈ విధంగా సల్మాన్ ఖాన్ సిగరెట్ విషయంలో భారీ గా వివాదాలను ఎదుర్కొన్నారు. ఇకపోతే ఈ సిగరెట్ వివాదం తో సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ విధంగా సల్మాన్ సిగరెట్ చేతిలో పట్టుకొని స్టేజ్ పైకి వచ్చారని విమర్శలు వచ్చిన తరుణంలో ఈయన ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా స్టేజ్ పైకి రాలేదు. అయితే ఈయన ఇకపై ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉండకూడదని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని అందుకే ఇలా ఈవారం బిగ్ బాస్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరు కాలేదంటూ ఓ వార్త సంచలనగా మారింది. అయితే సల్మాన్ ఖాన్ ఇదే విషయం గురించి బిగ్ బాస్ కార్యక్రమానికి దూరమయ్యారా లేకపోతే ఏదైనా కొన్ని కారణాలవల్ల ఈయన ఈ వారం హాజరు కాలేకపోయారా అనేది తెలియాలి అంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి