తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న వారి నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న వారు నటించిన సినిమాలలో విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం గీత గోవిందం అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.66 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన "ఎంసీఏ" సినిమా విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.51 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన సినిమా విడుదల అయిన 5 వ రోజు 3.12 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన బేబీ సినిమా విడుదల 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.94 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

జాతి రత్నాలు : నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాకు అనుదీప్ కే వీ దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించాడు. ఈ సినిమా విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.74 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: