ప్రపంచంలో ఒక  మనిషిని పోలి మరో  మనిషి ఉన్నట్లుగానే  సినిమాలలో తెలయకుండానే  నిర్మాణంలో ఉన్న ఒక కధ షూటింగ్ దశలో ఉన్న మరో సినిమాను పోలి ఉన్న సంఘటనలు   తరుచూ ఇండస్ట్రిలో జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి  స్పస్టమైన కారణాలు తెలియనప్పటికి  ఇలాంటి సినిమాలకు  సంబంధించిన ఒక పాయింట్ చుట్టూ సినిమాలు తీసిన సందర్భాలు వల్ల అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.  




ఆమధ్య నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’  నాగ శౌర్య ‘కృష్ణ వ్రిందా విహార’ సినిమాలు ఒకే స్టోరీలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు కూడ  ఫెయిల్ అయ్యాయి. కొన్ని  సంవత్సరాల క్రితం జూనియర్ నటించిన ‘టెంపర్’ కళ్యాణ్ రామ్  నటించిన ‘పటాస్’  ఒకే కధతో విడుదల అయి సక్సస్ సాధించాయి. ఇప్పుడు ఇలాంటి సందర్భం  మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రిలో జరగబోతోంది.  




లేటెస్ట్ గా ఒక స్టోరీ లైన్ తో మూడు సినిమాలు అనౌన్స్ కావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్  గా మారింది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా టైటిల్ తో ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈసినిమా కధ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు. అలాగే ధనుష్ హీరోగా  శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ కూడా మనీ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది అని టాక్. ఈరెండు సినిమాలు చాలవు అన్నట్లుగా సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘లక్కీ భాస్కర్’ టైటిల్ తో ఒక సినిమా అనౌన్స్ అయింది.




ఈసినిమాలో కూడ మెయిన్ స్టోరీ డబ్బు చుట్టూనే  తిరుగుతుంది అంటున్నారు. అంతేకాదు ఈమూడు సినిమాలు కూడ పిరియాడిక్ జోనర్ కధతో నడుస్తాయి అన్న వార్తలు కూడ వస్తున్నాయి. . ఈమూడు సినిమాలలో ఏసినిమా విజయం సాధిస్తుంది అన్న ఆశక్తి ఇండస్ట్రి వర్గాలలో ఉంది. అయితే ఈమూడు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను బట్టి ఈఅంచనాలు వస్తున్న నేపధ్యంలో ఈమూడు సినిమాల కధల మధ్య ఏదో ఒక తేడా ఉంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: