పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో తాజాగా "బ్రో" అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... కేతిక శర్మమూవీ లో సాయి తేజ్ కి జోడిగా నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. మరి ఈ 19 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 54.10 కోట్ల షేర్ ... 85.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది. ఇకపోతే ఈ సినిమా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 67.65 కోట్ల షేర్ ... 114 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 30.85 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. ఇకపోతే ఈ మూవీ కి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ దాదాపుగా లేదు అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: