తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో సూర్య ఒకరు. ఇకపోతే ఈయన చేతిలో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న అనేక సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

ప్రస్తుతం సూర్య ... సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో సూర్యా సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

మూవీ తర్వాత సూర్య ... వెట్రీ మారన్ దర్శకత్వంలో రూపొందబోయే వడివాసన్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సుధా కొంగార దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో సూర్య హీరో గా నటించబోతున్నాడు. 

ఇకపోతే ఈ సినిమా విక్రమ్ మూవీ.లోని రోలెక్స్ పాత్రకు కంటిన్యూస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత తెలుగు లో సూర్య ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించనుండగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత మరో సారి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూర్య నటించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సూర్య ఇప్పటికే తన తదుపరి మూవీ లకు సంబంధించి అదిరిపోయే లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ అన్ని మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: