తెలుగు సినీ పరిశ్రమలో కథ రచయితగా ... దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను ఏర్పరచుకున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథలను , మాటలను అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత సినీ దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా గుంటూరు కారం అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో వరుసగా త్రివిక్రమ్ సినిమాలకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ తో తెరకెక్కించబోయే బారి బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి మాత్రం అనిరుధ్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడుగా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే త్రివిక్రమ్ గతంలో పవన్ తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమాకు కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా సంగీతానికి మాత్రం ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ప్రస్తుతం అనిరుద్ వరుస క్రేజీ సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: