ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల హవా నడుస్తుంది అని చెప్పొచ్చు. టాలీవుడ్ సినిమాలో ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో రికార్డులను మాత్రమే కాకుండా కలెక్షన్స్ ని సైతం కళ్ళు చెదిరే విధంగా రాబడుతున్నాయి. ఇక అటువంటి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు లేవు అని గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. తెలుగు డైరెక్టర్లు లేదా నిర్మాతలు లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించకుండా ముంబై నార్త్ సైడ్ అమ్మాయిలకే ఎక్కువగా హీరోయిన్ అవకాశాలు ఇస్తున్నారు అని చాలామంది వాపోయారు. కానీ ఇప్పుడు మాత్రం సినీ ఇండస్ట్రీలో సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుతం తెలుగు అమ్మాయిల హవా నడుస్తోంది వారిలో శ్రీ లీలా వైష్ణవి చైతన్య ఈ ఇద్దరు తెలుగు హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తెలుగు సత్తా ఏంటో చూపిస్తున్నారు. ముఖ్యంగా 2021లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా రెండు సంవత్సరాల వ్యవధిలోనే భారీ ఎత్తున డబ్బులను కూడా సంపాదించింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన తెలుగు అమ్మాయిగా రికార్డు బద్దలు కొట్టింది. అయితే ప్రస్తుతం ఈ అందాల తార 10 సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గానే కాకుండా చాలా రంగాల్లో ముందడుగు వేస్తూ డబ్బులను సంపాదిస్తోంది.

 ఇక అసలు విషయం ఏంటంటే ఒకవైపు హీరోయిన్గా రాణిస్తూనే మరొకవైపు నిర్మాణరంగం వైపు కూడా అడుగులు వేయడానికి సిద్ధమయింది ఈ అందాల తార. కొత్త ప్రొడక్షన్ హౌస్  స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాణ భాగస్వామ్యంలో ఇతర సంస్థలతో కలిపి పెట్టుబడి పెడుతూనే మరొక పక్క సదరు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే డబ్బు సంపాదిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలను ఒప్పుకున్న ఆమె ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఇలా ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన సమంత కాజల్ పూజ హెగ్డే ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ డబ్బులు సంపాదించేవారు. అలా ప్రస్తుతం ఇప్పుడు శ్రీ లీల ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా డబ్బులు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: