

ఇక తెలుగులో కూడా ఈయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాంటి ఈ సూపర్ స్టార్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా టాలీవుడ్ లోనూ అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించారు. నటన అంటే పిచ్చి ఉన్న ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి తండ్రి నిర్మించే సినిమాలలో నటించాడు. అలా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భగవాన్ దాదా అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమిక్స్ చేద్దాం అనుకున్నారు.
ఇక రాకేష్ రోషన్ నిర్మాణంలోనే ప్రముఖ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని మొదలుపెట్టారు. మాతృక భాషలో బాల నటుడిగా నటించిన హృతిక్ రోషన్ ఈ సినిమాలో కూడా నటించాడు. అయితే కొంతకాలం షూటింగ్ చేసిన తర్వాత బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో సినిమాని మధ్యలోనే ఆపివేశారు. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే చిరంజీవి మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించేది అని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. మొత్తానికైతే రజనీకాంత్ తో నటించిన హృతిక్ రోషన్ చిరంజీవితో నటించే అవకాశాన్ని కోల్పోయారని చెప్పాలి.