
ఎప్పుడు కూల్ గా ఉండే రానా రజినీకాంత్ 170 సినిమాలోకి స్వాగతం డాషింగ్ హీరో రానాతో తలైవా 170 సినిమా మరింత ఆకర్షణీయంగా గంభీరంగా మారుతుంది అంటూ తెలియజేశారు.. విక్రమ్ పుష్ప వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాలోని క్యారెక్టర్లతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించకుండా ఫాహద్ ఫాజిల్కు కూడా స్వాగతం అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వీరిద్దరి క్యారెక్టర్లు ఇందులో ఎలా ఉంటాయో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీరి ఎంట్రీ తో ఈ సినిమా పైన మరింత బజ్ క్రియేట్ అవుతోంది.
అయితే ఇందులో రానా విలన్ గా నటిస్తున్నాడా లేకపోతే రజనీకాంత్ సహచరుడి పాత్రలో నటిస్తున్నారా అనే విషయం సస్పెన్స్ గా ఉన్నది. అలాగే ఇందులో అమితాబచ్చన్ తో పాటు దుషార విజయన్ ,రితికా సింగ్, మంజు వారియర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ 170 సినిమా ఎలా ఉంటుందో ఏ స్టైల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జై భీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ రజనీకాంత్ సినిమా కోసం భారీగానే ప్లాన్ చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి .కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సంగీతాన్ని అనిరుద్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయబోతున్నారట.