ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్.. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ని కూడా వరుస పెట్టి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ దర్శకులు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎంటర్టైర్మెంట్ గా వచ్చిన సేవ్ ది టైగర్స్ లో.. ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్, జోర్దార్ సుజాత, పావని, జబర్దస్త్ రోహిణి తదితరులు సైతం ఇందులో ప్రధాన పాత్రులుగా నటించారు. ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ మహీవి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కించారు.


మొత్తం ఆరు ఎపిసోడ్లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సిరీస్ మంచి సక్సెస్ను అందుకున్నది.. దీంతో ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నట్లు మహివీ రాఘవ తెలియజేయడం జరిగింది.. ఈ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కింది కానీ ఇందుకు సంబంధించి చిత్రీకరణ షూటింగ్ జరుగుతోందో లేదో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ సీజన్లో మరొక కొత్త యాక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.


రన్ రాజా రన్ మూవీ హీరోయిన్ సిరత్ కపూర్ ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. సేవ్ ది టైగర్ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని విన్నాను అందుకే ఈ ప్రాజెక్టులోకి నేను కూడా ఎంట్రీ ఇస్తున్నాను అంటూ హంసలేఖని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ రాసుకురావడం జరిగింది. ఈ వీడియోలో సీరత్ స్విమ్మింగ్ పూల్ లో బికినీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది సేవ్ ది టైగర్ సిరీస్ వంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ మన సెకండ్ పార్ట్ తో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: