కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా జపాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అను ఇమ్మాన్యూయల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... సునీల్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ నవంబర్ 10 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 44 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.5 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 5.32 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్ట వలసి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: