సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు  కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను ... మంచి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న వారిలో శ్రీకాంత్ ఓదెలా ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దగ్గర శిష్యుడుగా పని చేశాడు.

ఇక ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను శ్రీకాంత్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈయన తన తదుపరి మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించాడు. తాజాగా ఈయన మీడియాతో మాట్లాడుతూ ... నేను నా తదుపరి మూవీ ని నాని తో చేయబోతున్నాను.

ప్రస్తుతం ఆ కథ పైనే పూర్తిగా పని చేస్తున్నాను. నానితో నేను చేయబోయే సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శౌర్యవ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: