తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా అపజయాలు సాధించాయి. వాటితో ఈయన క్రేజ్ కూడా తెలుగులో బాగా పడిపోయింది. అలాంటి సమయంలోనే స్వామి రారా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని తిరిగి ఫామ్ లోకి వచ్చిన ఈ నటుడు అప్పటి నుండి ప్రతి సినిమాను ఆచితూచి ఎంచుకొని చేస్తూ ఉండడంతో ఈయన నటించిన సినిమాలు ఇప్పటికే అనేకం బ్లాక్ బస్టర్ లు కూడా అయ్యాయి.

దానితో ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంతకాలం క్రితం నిఖిల్ గర్రి బిహెచ్ దర్శకత్వంలో రూపొందిన "స్పై" అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించింది. ఇకపోతే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ఈ టీవీ సంస్థ ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా డిసెంబర్ 3 వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటల 30 కు ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: