తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాగ చైతన్య ఒకరు. ఇకపోతే ఈయన ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా నటిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఇందులో చైతూ అదిరిపోయే లుక్ లో ఉన్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య ... విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో డిసెంబర్ 1 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నాగ చైతన్య వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చైతూ "తండేల్" మూవీ లోని ఫస్ట్ లుక్ కి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల క్రితమే తండేల్ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాము. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఆ క్రెడిట్ మొత్తం విక్రమ్ కే కుమార్ కే ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ గెటప్ ను ముందుగా థాంక్యూ మూవీ కోసం అనుకున్నాం. కానీ వాడలేదు అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: