ఈరోజు విడుదలవుతున్న ‘యానిమల్’ మూవీ ఫైనల్ టాక్ గురించి టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ మ్యానియాకు ఈరోజు సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు విడుదల కాబోతున్న ‘సలార్’ ట్రైలర్ చెక్ పెట్టె అవకాశం ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు పరిశీలిస్తూ ఉంటే ప్రభాస్ అభిమానులు మాత్రం దీనికోసం చాల గట్టి ప్లాన్స్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ప్రభాస్ కు ‘సలార్’ మూవీ అత్యంత కీలకంగా మారింది. ఈరోజు విడుదలకాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తో ఈమూవీ మ్యానియా తారాస్థాయికి చేరుకుంటుందని ఈమూవీ నిర్మాతలు అంచనా వేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ట్రైలర్ కట్ చాల అద్భుతంగా వచ్చిందని లీకులు వస్తున్నాయి.ఈమూవీలో అద్భుతంగా ఉండబోయే విజువల్స్ ని శాంపిల్ గా ప్రశాంత్ నీల్మూవీ ట్రైలర్ లో చూపెడతాడు అని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ అన్ని భాషలలోనూ ఈరోజు ఒకేసారి విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ను చాల ఘనంగా చేస్తారు అని ప్రభాస్ అభిమానులు ఆశ పడినప్పటికీ ఎటువంటి హడావిడి లేకుండా కేవలం సైలెంట్ గా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు.  అయితే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించి ప్రభాస్ అభిమానులకు జోష్ ను కలిగించాలని ఈమూవీ నిర్మాతలు పక్కా ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం. ఈరోజు విడుదల అయ్యే ఈ ట్రైలర్ కు హిట్స్ విషయంలో అదేవిధంగా లైక్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసి తమ సత్తా చూపించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ప్రభాస్ అభిమానులు చాల వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ కాలక్షణసస్ పరంగా రికార్డులు సృష్టిస్తుందని డార్లింగ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: