
ఇలాంటి సమయంలోనే నాని ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంట్రాక్ట్ కావడం జరిగింది. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానాన్ని తెలియజేయడం జరిగింది.. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేశారు కదా.. మరి వచ్చిన ఆ ఫలితాల పైన మీ కామెంట్స్ ఏంటి అంటూ అడగగా.. దీనికి సమాధానంగా నాని తెలియజేస్తూ.. పదేళ్లు ఒక బ్లాక్ బాస్టర్ సినిమా చూశాము ఇప్పుడు థియేటర్లో సినిమా మారింది ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం అంటే తెలివిగా సమాధానాన్ని తెలిపారు.
ఇదే ఇంట్రాక్షన్లలో ఒక ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ తో మీరు కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని షేర్ చేయండి అంటూ తెలుపగా దీంతో నాని ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని సైత షేర్ చేయడం జరిగింది ఈ ఫోటోలో ఎన్టీఆర్ అండ్ నాని కౌగిలించుకొని కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. హాయ్ నాన్న సినిమాని కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇందులో శృతిహాసన్ ఒక ప్రత్యేకమైన పాటలు కనిపించబోతోంది.