బాలీవుడ్ టాప్ హీరోగా వరుస హిట్లతో దూసుకుపోతున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 'పఠాన్', 'జవాన్' సినిమాలతో ఏ పాన్ ఇండియా హీరో టచ్ చెయ్యాలని రికార్డులు సృష్టించాడు. ఈ రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా మన ముందుకు వచ్చాయి. కానీ 'డంకీ' సినిమాలో మాత్రం షారుఖ్ ఖాన్ చాలా అంటే చాలా క్లాస్‌గా కనిపించాడు.అసలు ఈ సినిమాలో ఫైట్లు లేవు. పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ లేవు.అందువల్ల వసూళ్లు స్లోగా సాగుతున్నాయి. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కలిసి ఈ సినిమాని నిర్మించారు. షారుఖ్ ఖాన్ మాస్ అవతార్ వదిలి 'డంకీ' సినిమాలో క్లాస్‌గా కనిపించాడు. ఈ మూవీపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం ఓ మోస్తరు ప్రదర్శన కనబరుస్తోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండవ రోజు అంటే డిసెంబర్ 22 కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


దీంతో ఈ రెండు రోజుల్లో మొత్తం 50 కోట్ల రూపాయల వషేర్ సూళ్లు రాబట్టింది. ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం అనుమానంగానే కనిపిస్తుంది.'డంకీ' సినిమా తొలిరోజు కేవలం 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు ఇంకా దారుణంగా రూ.19.20 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ మూవీ దాదాపు 50 కోట్ల రూపాయల దాకా షేర్ వసూళ్లు సాధించింది. ఫారిన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. ఇక వీకెండ్‌లో ఎలా వసూళ్లు సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది.పఠాన్, జవాన్ సినిమాలు రెండు వెయ్యి కోట్లు వసూలు చేశాయి. ఇక బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పర్లేదు అనిపించుకున్నా.. మిగిలిన ఏరియాల్లో మాత్రం డంకీ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ సినిమాకి ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా గట్టి పోటీ ఇస్తుంది. సలార్ సినిమా తొలి రోజే ఏకంగా 170కోట్ల పైగా వసూల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: