2011లో రవితేజ నటించిన మిరపకాయ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. 2012లో మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2013 వ సంవత్సరంలో మహేష్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పాటు రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2014లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
2015లో పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల సినిమా కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. 2016 లో నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ తో పాటు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2017లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్-150 సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. 2018 లో బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా సంక్రాంతి విన్నర్ కాగా 2019లో వెంకటేష్ నటించిన f-2 సినిమా విన్నర్ గా నటించింది. 2020లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. 2021లో రవితేజ నటించిన క్రాక్ సినిమా.. 2022లో నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాతోపాటు 2023లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది మరి ఈ ఏడాది ఎవరు నిలుస్తారో చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి