ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ కుర్చీ మడత పెట్టి అనే పాట ఎంతలా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. తెలంగాణకు చెందినటువంటి అహమ్మద్ షాషా అనే తాత కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ ఉపయోగించడంతో ఒక్కసారిగా ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక ఈ డైలాగ్ ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్నటువంటి గుంటూరు కారం సినిమాలో పాటని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా నుంచి ఈ పాటను విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో ఎంతోమంది సెలబ్రిటీలో ఈ పాటకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు డాన్స్ చేయడం కోసం తాము కూడా ప్లాన్ చేస్తున్నాము అంటూ విష్ణు ప్రియ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి