తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన ఆఖరుగా సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. సామజవరగమన లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఈ నటుడు" ఓం భీమ్ బుష్" అనే కామెడీ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ఈ రోజు అనగా మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం అలాగే శ్రీ విష్ణు ఆఖరుగా నటించిన సామజవరగమన సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తం లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. మరి ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను అలాగే ఈ మూవీ ఎన్ని కోట్లు సాధిస్తే హిట్ అనిపించుకుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో మూడు కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో ఒక కోటి ... ఆంధ్ర లో నాలుగో కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది. ఈ మూవీ కనక ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్ట గలిగినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv