దక్షిణాది సినిమా రంగంలో ప్రస్తుతం రాజమౌళి శంకర్ ల తరువాత ట్రెండింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దర్శకులలో లోకేష్ కనకరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు దర్శకత్వం వహించిన ‘ఖైదీ’ ‘విక్రమ్’ ‘లియో’ సినిమాలు సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ ఒక మూవీని తీయబోతున్న ఈ క్రేజీ దర్శకుడు దృష్టి టాలీవుడ్ పై కూడ ఉంది.కమలహాసన్ తో విక్రమ్ తీసిన దగ్గర నుండి లోకేష్ కు కమల్ కుటుంబంతో చాల సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఆసాన్నిహిత్యంతోనే ఇప్పుడు అతడు శృతి హాసన్ తో చేసిన సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటివరకు దర్శకుడుగా తన రేంజ్ నిరూపించుకున్న లోకేష్ ఇప్పుడు ఏకంగా శృతి హాసన్ తో రొమాన్స్ చేయడం చూసి చాలమంది ఆశ్చర్య పడ్డారు.వాస్తవానికి ఇది సినిమా కాకపోయినప్పటికీ ఒక మ్యూజిక్ వీడియో. శృతి హాసన్ దర్శకత్వం వహించిన ఒక మ్యూజిక్ వీడియోలో లోకేష్ ఆమె పక్కన రొమాంటిక్ గా నటించాడు. అయితే శృతి పక్కన లోకేష్ ను చూసి చాలామంది సెటైర్లు కూడ వేస్తున్నారు. టాప్ దర్శకుడు అయినంతమాత్రాన శృతి లాంటి టాప్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఏమిటి అంటూ అంటూ లోకేష్ ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.ఈ సెటైర్ల దాడి ఎక్కువైపోవడంతో లోకేష్ ఈ విషయం పై స్పందించాడు. తాను శృతి తీసిన వీడియోలో ఆమె పక్కన నటించడానికి ఏమాత్రం ఇష్ట పడలేదని అయితే శృతి ఒత్తిడితో తాను ఆమె పక్కన నటించవలసి వచ్చింది అంటూ ఓపెన్ గా క్లారిటీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. హోలీ రోజున విడుదలైన రోజున మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అయితే లోకేష్ అభిమానులు మాత్రం గతంలో భాగ్యరాజ లాంటి తమిళ దర్శకులు టాప్ హీరోయిన్స్ పక్కన హీరోగా నటించిన విషయాన్ని గుర్తుకు చేస్తూ లోకేష్ బాగా నటించాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..  
మరింత సమాచారం తెలుసుకోండి: