లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం భారతీయుడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి ఆ సమయంలో అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇంతటి స్థాయి విజయం సాధించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో కమల్ హాసన్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించి రెండింటి లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరో గా "భారతీయుడు 2" అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాకపోతే దానిని "ఇండియన్ 2" అనే పోస్టర్ తో విడుదల చేశారు.  తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ మూవీ విడుదల గురించి అప్డేట్ ఇచ్చింది.  "భారతీయుడు 2" సినిమాని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే భారతీయుడు మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న మూవీ కావడంతో "భారతీయుడు 2"  పై తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: