టిల్లు స్క్వేర్’ తరువాత విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఆతరువాత వారానికి కనీసం నాలుగు చిన్న సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ వాటిలో ఏఒక్క చిన్న సినిమాకు సరైన కలక్షన్స్ రావడంలేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీని లెక్క చేయకుండా విడుదలైన మళయాళ చిన్న సినిమా ‘మంజు మెల్ బాయ్స్’ ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించడమే కాకుండా ఈసినిమా మూడవ వారంలోకి ఎంటర్ అయిన తరువాత కూడ కలక్షన్స్ బాగా ఉండటంతో ఈసినిమాను చాల ధియేటర్లలో కొనసాగిస్తున్నారు.ఈసినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించడమే కాకుండా కలక్షన్స్ పరంగా ఈమూవీ కేవలం కేరళ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడ సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు తెలుగులో విడుదలవుతున్న చిన్న సినిమాలకంటే మళయాళ డబ్బింగ్ సినిమాల పై మ్యానియా పెరిగిందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈమూవీలో హీరోయిన్ పాత్ర లేకపోయినప్పటికీ ఆవిషయాన్ని కూడ పట్టించుకోకుండా తెలుగు ప్రేక్షకులు ఈసినిమాను చూస్తున్నారు అంటే వెరైటీగా ఉండే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు భాషాభిమానాన్ని పక్కకు నెడుతున్నారు అని అనుకోవాలి.పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ మళయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈమూవీని త్వరలో తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ‘మంజుమల్ బాయ్స్’ మూవీకి వచ్చిన స్పందనతో ఈమూవీ కూడ ఈ సమ్మర్ లో బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని మార్కెట్ వర్గాలలో అంచనాలు ఉన్నాయి.పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఓటీటీ లో కూడ ప్రేక్షకులు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలను చూస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ధియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’ మూవీని ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విపరీతంగా చూస్తున్నట్లు రేటింగ్ లు రావడం చూసిన వారికి ధియేటర్లను అదేవిధంగా ఓటీటీ ని మళయాళ డబ్బింగ్ సినిమాలు షేక్ చేస్తున్నాయా అన్నసందేహాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: