సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. అలా ఇప్పటివరకు ఎంతో మంది ఎన్నో సినిమాలను వదులుకున్న వారు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మిస్ చేసుకున్న మూవీలలో విక్రమార్కుడు మూవీ ఒకటి. మరి పవన్ ఎందుకు ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

విక్రమార్కుడు సినిమా డైరెక్టర్ అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసిన విక్రమార్కుడు సినిమా కథ మొత్తం విన్న తర్వాత ఇది పవన్ కి అయితే బాగుంటుంది అని అనుకున్నారట. దానితో వెంటనే బంగారం మూవీ షూటింగ్ లో ఉన్న పవన్ ను కలిసి విక్రమార్కుడు కథను వినిపించారట. కథ మొత్తం విన్న పవన్ సినిమా స్టోరీ సూపర్ గా ఉంది. కాకపోతే ప్రస్తుతం నేను బంగారం సినిమా చేస్తున్నాను. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత ఓ మూడు సంవత్సరాలు ఏ సినిమా చేయకుండా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను.

ఆ కారణంతో నేను ఇప్పుడు మీరు చెప్పిన కథ అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా చేయలేను. ఇదే సినిమాను వేరే ఎవరితోనైనా చేసుకోండి అని సలహా ఇచ్చారట. ఇక దానితో చేసేదేమీ లేక రాజమౌళి ఈ కథకు రవితేజ కూడా బాగానే సెట్ అవుతాడు అనే ఉద్దేశంతో ఆయనకు ఈ కథను వినిపించడం , ఆయన వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , అలా ఈ మూవీ విక్రమార్కుడు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయం సాధించడం జరిగింది.

ఇలా పవన్ కళ్యాణ్ "బంగారం" సినిమా షూటింగ్ లో ఉండడం ఆ తర్వాత మరో మూడు సంవత్సరాలు సినిమా చేయొద్దు అనే ఉద్దేశంతో విక్రమార్కుడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నారట. ఇకపోతే విక్రమార్కుడు మూవీతో రవితేజ మాత్రం అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: