మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన కొన్ని రోజుల క్రితం భ్రమయుగం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు . ఈ మూవీ లో
ఆమ్లదా లీజ్ హీరోయిన్ గా నటించగా , అర్జున్ అశోకన్ , సిద్ధార్ధ్ భరతన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.


రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , చక్రవర్తి రామచంద్ర ,  ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందించిన ఈ మూవీ కి షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఇకపోతే మొదట మలయాళం లో విడుదల అయిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా మలయాళం లో విడుదల అయిన కొన్ని రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమాను తెలుగు లో విడుదల చేశారు.

సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు అనే చెప్పవచ్చు. కాకపోతే కొంత మంది తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత కొన్ని రోజులకే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ కి ఓ టి టి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా భ్రమయుగం యూనిట్ ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: