టాలీవుడ్ పెద్ద సినిమా ఫ్యామిలిలో ఒకటైన సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ కూడా సుధీర్ బాబులో ఉన్నాయి.కానీ అలాంటి నటుడికి ఇప్పటిదాకా ఒక్క సరైన హిట్టు కూడా లేదు. ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో ఒకటో రెండో సినిమాలు హిట్ అయ్యాయి తప్ప ఆ తరువాత నుంచి ఒక్క హిట్టు బ్లాక్ బస్టర్ హిట్టు కూడా పడలేదు. మధ్యలో భలే మంచి రోజు, సమ్మోహనం లాంటి హిట్లు పడ్డా అవి మరీ గుర్తుండిపోయే సినిమాల్లా మిగల్లేదు.దీంతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలన్న కసితో 'హరోం హర' సినిమా చేశాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి శనివారం కూడా మంచి రెస్పాన్స్ లభించింది. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఈ మూవీలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు.


చైతన్ భరద్వాజ్ ఈ మూవీకి మ్యూజిక్‌ను అందించాడు.ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను కూడా భారీ స్థాయిలో పెంచుకుంది. ఇంకా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 6.00 కోట్లు దాకా బిజినెస్ చేసుకుంది.ఇంకా ఈ చిత్రానికి మొదటి రోజు టాక్ డీసెంట్‌గా రావడంతో మంచి ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి. రెండో రోజు కూడా ఈ సినిమా బాగానే హోల్డ్ చేయగలిగింది. దాని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 60 లక్షలు దాకా షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమా ఏకంగా రూ. 70 లక్షలు రాబట్టింది.ఫుల్ లెంగ్త్ మాస్ స్టోరీతో రూపొందిన 'హరోం హర' మూవీకి రెండు రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవాలి.దాని ఫలితంగా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.20 కోట్లు షేర్‌ను ఈ సినిమా వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ సినిమా రూ. 1.55 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: