శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌లో రాణిస్తోన్న అందాల హీరోయిన్. అందమే కాదు.. నటనతోను అదరగొడుతోంది ఈ చిన్నది. తాజాగా శ్రీలీల గుంటూరు కారం సినిమాతో పలకరించింది.అలా ఉంటే శ్రీలీల డిమాండ్ రోజు.. రోజుకు తగ్గిపోతోంది. ధమాకా తర్వాత టాలీవుడ్‌ మొత్తం శ్రీలీల పేరునే జపించింది. వచ్చిన ఆఫర్స్ అన్ని ఓకే చేసింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది. ఈ మధ్య కాలంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోతోంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు 'గుంటూరు కారం, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్‌ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది.అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. దీంతో శ్రీలీల ఆఫర్ల కోసం కొత్త దారిని వెతుకుతోన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది. తాజాగా ఈ భామ తన అందాలను అరబోసిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చూసింది. అందరి హీరోయిన్లకు భిన్నంగా ఆలోచిస్తూ ఏకంగా బాత్రూమ్‌లో దిగిన ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి బాత్రూమ్‌లోని సింక్ దగ్గర హాట్ పోజులిచ్చింది. మేకప్ బ్రష్‌లు పట్టుకుని కొంటె చూపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ డ్రెస్‌లో ముఖ్యంగా తన థైస్ షోతో అలరిచింది. థైస్ అందాలు మరింత అందంగా కనిపించడంతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. శ్రీలల అందానికి ఎన్ని మార్కులు ఇచ్చిన తప్పు లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలల బాత్రూమ్‌ ఫొటోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: